hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu arrow

In this Article

    లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu

    Pregnancy

    లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    కొంతమందికి తొడ లోపలి భాగంలో రాపిడి ఉంటుంది. ఇది అసౌకర్యంగా, చిరాకుగా ఉంటుంది. తొడకు ఇరువైపులా చర్మం మధ్య రాపిడి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ రాపిడి వల్ల చర్మం ఉపరితలం పచ్చిగా, చికాకుగా అనిపిస్తుంది. చాలా సందర్భాలలో, ఇది పరిగెత్తుతున్నప్పుడు లేదా నడిచేటప్పుడు జరుగుతుంది. దీని వల్ల తొడల మధ్య నిరంతరం రాపిడి జరుగుతుంది. అయినప్పటికీ, తొడలను ఎక్కువసేపు నొక్కి ఉంచినప్పుడు కూడా ఇది సంభవించవచ్చు. ఇక్కడ మేము కారణాలు, లక్షణాలు, చికిత్స ఇంకా ఇది జరగకుండా ఎలా నిరోధించాలో చర్చిస్తాము.

    తొడ లోపలి భాగంలో పగుళ్లు అంటే ఏమిటి? (What is inner thigh chafing in Telugu)

    లోపలి తొడ భాగంలో చికాకు లేదా పగుళ్లు అనేది అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. తొడల మధ్య ఘర్షణ చికాకు, నొప్పికి కారణమవుతుంది. బిగుతుగా ఉండే బట్టలు వేసుకునే వారికి ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా టినియా క్రూరిస్ లేదా జాక్ ఇచ్ అంటారు. కొన్ని సందర్భాల్లో, దీర్ఘకాలికంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనే వారికి సెకండరీ ఇన్ఫెక్షన్లు కూడా కలగవచ్చు.

    తొడల లోపలి భాగంలో పగుళ్లకు కారణాలు (Causes of inner thigh chafing in Telugu)

    చాలా సందర్భాలలో, తొడల లోపలి భాగంలోని చర్మం పొడిగా మారవచ్చు. ఇది రాపిడిని పెంచి, పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. ఇతర సందర్భాల్లో, తామర, సోరియాసిస్ లేదా చర్మానికి చిరాకు కలిగించే ఇతర పరిస్థితులు చర్మంలో పగుళ్లను మరింత ఎక్కువ చేస్తాయి. తొడ లోపలి భాగంలో పగుళ్లు ఏర్పడటానికి ఇతర కారణాలు కింది విధంగా ఉన్నాయి:

    1. బిగుతు దుస్తులు (Tight clothing)

    చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల రాపిడి పెరుగుతుంది, తొడ లోపలి భాగంలో పగుళ్లు ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా లెగ్గింగ్స్, సైకిల్ షార్ట్స్ వంటి తొడల చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించే వారికి వర్తిస్తుంది

    2. తేమ (Moisture)

    చర్మం తడిగా ఉన్నప్పుడు రాపిడికి గురికావడం వల్ల మరింత సున్నితంగా మారుతుంది. చెమట లేదా ఎక్కువ సేపు తడి బట్టలు వేసుకొని కూర్చోవడం వల్ల తేమ ఏర్పడవచ్చు.

    3. అధిక బరువు ఉండటం (Being overweight)

    పురుషులలో, స్త్రీలలో ఇద్దరిలోనూ అధిక బరువు అనేది తొడల లోపలి భాగంలో పగుళ్లు కలగడానికి ప్రధాన కారణం. అధిక బరువు ఉండటం వల్ల తొడలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది రాపిడి, పగుళ్లను పెంచుతుంది.

    4. సరికాని ఉత్పత్తుల వినియోగం (Incorrect lubrication)

    కొంతమంది డియోడరెంట్ లేదా యాంటిపెర్స్పిరెంట్ వంటి ప్రాంతానికి అనుచితమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం దెబ్బతింటుంది, ఘర్షణ పెరుగుతుంది. ఇది పగుళ్లు కలిగించే అవకాశాలను పెంచుతుంది.

    5. నడవడం, పరిగెత్తడం లేదా సైక్లింగ్ (Walking, running or cycling)

    ఈ కార్యకలాపాలు తొడల లోపలి భాగంలో చిట్లిపోవడానికి ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా, రాపిడిని తగ్గించడానికి తగిన దుస్తులు ధరించని లేదా సరైన ఉత్పత్తులను ఉపయోగించని వ్యక్తులు ఈ పరిస్థితి ఎదుర్కొంటారు.

    6. చర్మ వ్యాధులు (Skin conditions)

    ఎక్జేమా, సోరియాసిస్ వంటి వ్యాధులు చర్మం చిట్లిపోయే అవకాశాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఈ పరిస్థితులు చర్మం మరింత పొడిగా, సున్నితంగా ఉండటానికి కారణమవుతాయి. ఇది పగుళ్లను పెంచుతుంది.

    తొడల లోపలి భాగంలో పగుళ్లకు లక్షణాలు ( Symptoms of inner thigh chafing in Telugu)

    తొడల లోపలి భాగంలో పగుళ్లు రావడానికి అత్యంత సాధారణ లక్షణం తొడలపైన దద్దుర్లు. ఈ దద్దుర్లు ఎర్రగా, దురదతో బాధాకరంగా ఉండవచ్చు. ఇది చర్మం చికాకు లేదా కఠినతను కూడా కలిగించవచ్చు. తొడల లోపలి భాగంలో పగుళ్లకు ఇతర సాధారణ లక్షణాలు:

    • దురద
    • మంట
    • ఎర్రబడటం
    • పొక్కులు
    • దద్దుర్లు
    • హైపర్ పిగ్మెంటేషన్
    • కురుపులు
    • వాపు
    • ద్రవం కారడం
    • నొప్పి

    మీకు ఇది కూడా నచ్చుతుంది: తొడ పగుళ్లు: లక్షణాలు, కారణాలు మరియు కనిపించే తీరు

    తొడల లోపలి భాగంలో పగుళ్లకు చికిత్స (Treatment of inner thigh chafing in Telugu)

    తొడల లోపలి భాగంలో పగుళ్లకు చికిత్స సాధారణంగా ఆ పరిస్థితి కలగడానికి గల కారణంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా చికిత్సకు ప్రయత్నించే ముందు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి. తొడ లోపలి భాగంలో పగుళ్లను నివారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని సాధారణ పద్ధతులు కింద పేర్కొన్నాము:

    1. చర్మ సంరక్షణ ఉత్పత్తులు (Skin care products)

    చర్మానికి ఉపశమనం కలిగించడానికి, బాగు చేయడానికి అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్పత్తులలో తొడల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోషన్లు, క్రీములు లేదా నూనెలు ఉంటాయి.

    2. పెట్రోలియం జెల్లీ (Petroleum jelly)

    తొడల పగుళ్లను తగ్గించడంలో, నివారించడంలో సహాయపడటానికి, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) పెట్రోలియం జెల్లీని ఉపయోగించమని సిఫార్సు చేస్తుంది. ఈ జెల్లీ చర్మం పొడిబారకుండా, పొక్కులు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇది కొలుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుందనడంలో సందేహం లేదు.

    3. దురద నివారణలు (Itching remedies)

    తొడ లోపలి భాగంలో దురద భరించలేనంతగా ఉంటే, కొన్ని విభిన్న పద్ధతులు ఈ లక్షణాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఓవర్-ది-కౌంటర్ యాంటిహిస్టామైన్ తీసుకోవడం, ఆ భాగంలో కూల్ కంప్రెస్ రాయడం, అలోవెరా జెల్ ఉపయోగించడం లేదా OTC టాపికల్ క్రీమ్ ఉపయోగించడం వంటివి ఉన్నాయి.

    4. పౌడర్‌లు (Powders)

    టాల్కమ్ పౌడర్, బేబీ పౌడర్, కార్న్‌స్టార్చ్, యారోరూట్ పౌడర్‌లను తొడల లోపలి భాగంలో రాయడం వల్ల పగుళ్లు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ పౌడర్‌లు అధిక తేమను గ్రహించి, తద్వారా తొడల మధ్య రాపిడిని తగ్గిస్తాయి.

    5. ఇతర చర్మ చికిత్సలు (Other skin treatments)

    తొడ లోపలి భాగంలో పగుళ్లను కలిగించే ఇతర చికిత్సలలో యాంటీబయాటిక్ వినియోగం, మృదువైన కట్టు కట్టడం, తేమ ఏర్పడకుండా ఉండే దుస్తులు ధరించడం ఉన్నాయి.

    తొడల లోపలి భాగంలో పగుళ్లను ఎలా ఆపాలి? ( How to stop inner thigh chafing in Telugu)

    తొడ లోపలి భాగంలో పగుళ్లు ఏర్పడే ప్రమాదాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి ఈ కింది దశలను అనుసరించండి:

    1. తగినంత నీరు తాగడం (Staying hydrated)

    సరైన హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడం సౌకర్యంగా ఉండటానికి, పగుళ్లను నివారించడానికి చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌గా ఉండటం అంటే రోజంతా పుష్కలంగా నీరు తాగడం. శారీరక కార్యకలాపాలు చేసేటప్పుడు నీరు తాగటం చాలా అవసరం.

    2. వదులుగా ఉండే దుస్తులు ధరించడం (Wearing Loose-Fitting Clothing)

    చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల తొడల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఇది పగుళ్లు కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు లేదా ఇతర శారీరక కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పుడు వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోండి.

    3. బరువు తగ్గడం (Losing weight)

    కొన్ని కిలోల బరువు తగ్గడం ద్వారా ఆకర్షణీయంగా మారడం మాత్రమే కాదు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఉదాహరణకు, వ్యక్తులు సరైన బరువు పరిధిలో ఉన్నట్లయితే, తొడ లోపలి భాగంలో చిట్లిపోవడాన్ని నివారించవచ్చు.

    Reference
    1. Mazhar M, Simpson M, Marathe K. (2019). Inner thigh friction as a cause of acne mechanica. Pediatr Dermatol. NCBI

    Tags

    What is Inner Thigh Chafing in Telugu, What are the causes of Inner Thigh Chafing in Telugu, Symptoms of Inner Thigh Chafing in Telugu, Treatment of Inner Thigh Chafing in Telugu, Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in English, Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Hindi, Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Tamil, Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.