hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Illnesses & Infections arrow
  • మీ పిల్లలకు నులిపురుగులు(నట్టలు) ఉన్నాయో లేదో తెలుసుకోవడమెలా? (How to Know If Your Baby Has Worms in Telugu?) arrow

In this Article

    మీ పిల్లలకు నులిపురుగులు(నట్టలు) ఉన్నాయో లేదో తెలుసుకోవడమెలా? (How to Know If Your Baby Has  Worms in Telugu?)

    Illnesses & Infections

    మీ పిల్లలకు నులిపురుగులు(నట్టలు) ఉన్నాయో లేదో తెలుసుకోవడమెలా? (How to Know If Your Baby Has Worms in Telugu?)

    3 November 2023 న నవీకరించబడింది

    నులిపురుగుల ఇన్ఫెక్షన్లు చాలా కామన్​గా వస్తాయి. వీటి ప్రాబల్యం గురించి తెలుసుకోవడం చాలా కష్టం. మీ శిశువులు చెప్పులు లేకుండా నడిచినపుడు, కలుషితమైన నీటిలో ఆడినపుడు, అనారోగ్యకరమైన ఆహారం తిన్నపుడు నులిపురుగులు వచ్చే ప్రమాదం ఉంది. నులిపురుగుల ఇన్ఫెక్షన్లు అనేక రకాలుగా ఉన్నాయి. సాధారణ రకం నులిపురుగులు పిన్​వార్మ్​గా పిల్లలను ప్రభావితం చేస్తాయి.

    నులిపురుగులు ఉంటే లక్షణాలు మరియు సంకేతాలు వాటివలన ఇన్ఫెక్షన్స్: (Signs and Symptoms of Worm Infection in Telugu)

    నులిపురుగుల వలన వచ్చే ఇన్ఫెక్షన్లకు చాలా సార్లు ఎటువంటి సంకేతాలు ఉండవు. ఒకవేళ కొన్ని కనిపించినప్పటికీ ఆ సమయాల్లో మనం వాటిని సరిగ్గా గమనించం. నులిపురుగులు ఉన్నాయని తెలుసుకునేందుకు కొన్ని సాధారణ సంకేతాలు

    • కడుపులో తీవ్రమైన నొప్పి
    • బరువుతగ్గడం
    • గజిబిజి (చికాకుగా ఉండడం)
    • మలంలో రక్తం రావడం
    • వాంతులు లేదా దగ్గు
    • పాయువు చుట్టూ నొప్పి మరియు దురద
    • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా తరుచుగా మూత్రం రావడం

    పిల్లలకి నులిపురుగులు ఎలా వస్తాయి? (How can a Child Get Worms in Telugu?)

    నులిపురుగులు ఈ కింది మార్గాల్లో శరీరాన్ని ముట్టడించవచ్చు:

    • మట్టిలో లేదా ఇన్ఫెక్టెడ్ ప్రాంతంలో పిల్లలు చెప్పులు లేకుండా నడవడం వలన నులిపురుగుల బారిన పడొచ్చు. పిల్లల చేతుల్లో మట్టి ఉన్నపుడు వారు ఆ అపరిశుభ్రమైన చేతులను నోటిలో పెట్టుకుంటే నులిపురుగులు సోకే ప్రమాదం ఉంటుంది.
    • సరస్సులు, నీటి కుంటల వంటి నీటివనరుల్లో కొన్నిసార్లు నులిపురుగులు సంతానాన్ని కంటాయి. ఇటువంటి కలుషితమైన ప్రదేశాల్లో ఈతకొట్టడం ద్వారా కూడా నులిపురుగులు సోకే ప్రమాదం ఉంది.
    • పూర్తిగా ఉడకని లేదా అపరిశుభ్ర ఆహారం వలన కూడా నులిపురుగులు రావొచ్చు. కలుషితమైన నేలలో పెరిగే కూరగాయలు కూడా నులిపురుగులు వచ్చేందుకు ఒక కారణం కావొచ్చు.

    నులిపురుగులు శిశువులను ఎలా ప్రభావితం చేస్తాయి? (How do Worm’s Affect a Baby in Telugu?)

    నులిపురుగులను చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల పేగు రక్తస్రావం కూడా జరుగుతుంది. దీంతో శిశువు వివిధ రకాల అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. తక్కువ బరువు, జీర్ణసమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇక ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకు భవిష్యత్‌లో మరింత హాని కలిగిస్తుంది.

    నులిపురుగుల ఇన్ఫెక్షన్ కోసం చికిత్స (Treatment for Worm Infection)

    మీ శిశువులో నులిపురుగుల వలన వచ్చిన ఇన్ఫెక్షన్లను గుర్తించేందుకు సరైన మార్గం... వైద్యునిచే పరీక్షించడం మాత్రమే. నులిపురుగులకు ప్రధాన కారకాన్ని కనుక్కునేందుకు పరీక్షల తర్వాత డాక్టర్ మీ శిశువుకు మలపరీక్షను సిఫారసు చేయొచ్చు. నులిపురుగుల ఇన్ఫెక్షన్ల విషయంలో నోటి ద్వారా తీసుకునే మందులను డాక్టర్ మీకు సూచించవచ్చు. నులిపురుగుల నివారణ చికిత్స కూడా సిఫారసు చేయబడుతుంది. నులిపురుగుల నివారణ కోసం మీరు హెర్బల్ లేదా ఇంటి చిట్కాల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపొచ్చు. కానీ డాక్టర్ సలహా లేకుండా మీరు అలా చేయడం మంచిది కాదు. నులి పురుగులు సులువుగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి తిరిగి ఇన్ఫెక్షన్​కు కారణం అవుతాయి. అటువంటి సందర్భంలో మీ కుటుంబం మొత్తం నులిపురుగుల నివారణ చికిత్స చేయించుకోమని డాక్టర్ సలహా ఇవ్వొచ్చు. కుటుంబంలో ఎవరూ ఇన్ఫెక్షన్​కు మూలం కాదని నిర్ధారించుకోవచ్చు.

    Tags:

    Worm infection in babies in telugu, How babies infected with worms in telugu, Worm infection symptoms in telugu, How do we know babies infected with worms in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.