hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Milestones arrow
  • పుట్టిన మొదటి సంవత్సరంలో మీ పసిబిడ్డ చేరుకునే మైలురాళ్లు (Baby Milestones in the First Year of Birth in Telugu) arrow

In this Article

    పుట్టిన మొదటి సంవత్సరంలో మీ పసిబిడ్డ చేరుకునే మైలురాళ్లు (Baby Milestones in the First Year of Birth in Telugu)

    Milestones

    పుట్టిన మొదటి సంవత్సరంలో మీ పసిబిడ్డ చేరుకునే మైలురాళ్లు (Baby Milestones in the First Year of Birth in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    మీ బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో సాధించిన ఎదుగుదలని, అలాగే వారు మైలురాళ్లని దాటడాన్ని గమనిస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ప్రతి బేబీ ప్రత్యేకమైనదే. వారి ఎదుగుదల కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చార్టులు కొన్ని పరిణామాలను అంచనా వేయడానికి, అలాగే మీ బిడ్డ పూర్తి ఎదుగుదలను ట్రాక్ చేయడానికి వారాలవారీ గైడ్‌గా పనిచేస్తాయి.

    నెలల వారీగా పసిబిడ్డ దాటే మైలురాళ్లు (Baby Milestones by Month in Telugu)

    పిల్లలని పెంచడంలో అన్నిటికన్నా ఉత్సాహకరమైన భాగం ఏమిటంటే, వారు వారాలవారీగా ఎలా పెరుగుతున్నారు, వేగంగా ఎలా ఎదుగుతున్నారని గమనించడం. ఈ మైలురాళ్లని ఇక్కడ ఆసక్తికరంగా విభజించి, కింది విభాగంలో వివరంగా పేర్కొన్నాం.

    అప్పుడే పుట్టిన పసిబిడ్డ మైలురాళ్లు (Newborn Baby Milestones in Telugu)

    వారం 1 (Week 1)

    పసిపిల్లలు తమ బాగోగులు చూసుకునేవారి గొంతులని గుర్తించటం నేర్చుకునే సమయం ఇది. అలా భాష అభివృద్ధికి పునాది పడుతుంది.

    వారం 2 (Week 2)

    పసిపిల్లలు తమ దగ్గరి దూరంలో ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు.

    వారం 3 (Week 3)

    కచ్చితంగా కాకున్నప్పటికీ, పసిపిల్లలు హత్తుకుని పడుకోవటం నేర్చుకుంటారు.

    వారం 4 (Week 4)

    ఇది పసిపిల్లల మైలురాళ్లలో మొదటి పెద్దది, ఈపాటికి “కూ” అలాగే “ ఆహ్” అనే శబ్దాలు చేయటం నేర్చుకుంటారు.

    1వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (1 Month Baby Milestones in Telugu)

    వారం 5 (Week 5)

    పసిపిల్లల కదలికలు మరింత నెమ్మదిగా, మృదువుగా అలాగే తక్కువ యాదృఛ్చికంగా మారతాయి.

    వారం 6 (Week 6)

    పసిపిల్లలు వారి మొహంలో కండరాలని ఉపయోగించి చిరునవ్వు లేదా నవ్వటం ప్రారంభిస్తారు.

    వారం 7 (Week 7)

    పసిపిల్లలు ఇంద్రియజ్ఞానంతో శబ్దాలని గుర్తిస్తూ అర్థం చేసుకోవటం మొదలుపెడతారు.

    వారం 8 (Week 8)

    మెడ కండరాలు గట్టిపడటంతో, పసిపిల్లలు తమ తలలను 45 డిగ్రీల కోణం వరకూ నిలిపి ఉంచగలరు.

    2 వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (2nd Month Baby Milestones in Telugu)

    వారం 9 (Week 9)

    పసిపిల్లలకి ఎక్కువ ఉత్సుకత ఉంటుంది, అలాగే పెద్ద శబ్దస్థాయి ఉన్న(పిచ్) గొంతుల వంటి శబ్దాలకి ప్రతిస్పందిస్తారు.

    వారం 10 (Week 10)

    పసిపిల్లలు జనసమ్మర్దంలో తెలిసిన మొహాలని గుర్తించడం నేర్చుకుంటారు.

    వారం 11 (Week 11)

    పసిపిల్లలకి కొత్త విషయాలని నేర్చుకోవటంపై మరింత ఉత్సుకత ఉన్నట్లు కన్పిస్తారు.

    వారం 12 (Week 12)

    ఈ దశలో, పసిపిల్లలు సామాన్యంగా తమ చేతుల పనిని అర్థం చేసుకోవటం మొదలుపెడతారు.

    3వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (3rd Month Baby Milestones in Telugu)

    వారం 13 (Week 13)

    ఈ వారంలో పిల్లలు నవ్వటం, ఆగకుండా కేరింతలు కొట్టడం అలాగే గుంభనంగా నవ్వి ఊరుకోవటం లాంటివి చేస్తుంటారు.

    వారం 14 (Week 14)

    చేతులు ఇంకా కాళ్ల మధ్య శిశువులు సమన్వయం ప్రదర్శిస్తారు.

    వారం 15 (Week 15)

    పసిపిల్లలు ఈ సమయంలో బోర్లా పడటం నేర్చుకుంటారు.

    వారం 16 (Week 16)

    మెడ, అస్థిపంజరం, కడుపులో కండరాలు మరింత బలంగా మారుతూ ఉంటాయి.

    4వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (4th Month Baby Milestones in Telugu)

    వారం 17 (Week 17)

    పసిపిల్లలు మరింత స్వరంతో అరుస్తారు, వివిధ రకాల శబ్దాలని చేస్తుంటారు.

    వారం 18 (Week 18)

    ఈ సమయంలో పసిపిల్లలు ఏకాంతంగా గడపటాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టవచ్చు.

    వారం 19 (Week 19)

    పసిపిల్లలకి ఈ సమయంలో శబ్దాలని బొమ్మలతో అనుసంధానించటం నేర్పించవచ్చు.

    వారం 20 (Week 20)

    పసిపిల్లలు తమనితాము అర్థం చేసుకోవటం, గుర్తించడం ప్రారంభిస్తారు, అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసి నవ్వవచ్చు కూడా.

    5వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (5th Month Baby Milestones)

    వారం 21 (Week 21)

    ఈ వారానికి పసిపిల్లలు పాకటం మొదలుపెట్టేస్తారు.

    వారం 22 (Week 22)

    ఈ దశ కొంచెం కంగారుగా ఉంటుంది. ఎందుకంటే పసిపిల్లలు ఈ సమయంలో ఏది కన్పిస్తే దాన్ని నోటిలో పెట్టేసుకుంటూ ఉంటారు.

    వారం 23 (Week 23)

    ఈపాటికి పసిపిల్లలు తమ పైశరీర భాగంలో కండరాల బలాన్ని పెంచుకుని ఉంటారు.

    వారం 24 (Week 24)

    కండరాల ఎదుగుదల కొనసాగుతుంది.

    6వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (6th Month Baby Milestones)

    వారం 25 (Week 25)

    స్థూల చలన నైపుణ్యాలు (గ్రాస్ మోటార్ స్కిల్స్) అంటే నడవటం, పాకటం వంటివి అభివృద్ధి చెందుతాయి.

    వారం 26 (Week 26)

    పసిపిల్లలకి తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో బలమైన అనుబంధం ఏర్పడి ఉన్నందున విడిపోతే వచ్చే మానసిక ఆందోళన (సెపరేషన్ యాంక్జైటీ) ఈ సమయంలో కలగవచ్చు.

    వారం 27 (Week 27)

    పసిపిల్లలు అన్నిటిలో కారణ-ప్రభావ సంబంధాలని ఏర్పర్చుకోవటం నేర్చుకుంటారు.

    వారం 28 (Week 28)

    పసిపిల్లలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టవచ్చు. లేదా వారి చేతులని అంతకుముందు కంటే చాలా నూతనంగా ఉపయోగించవచ్చు.

    7వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (7th Month Baby Milestones in Telugu)

    వారం 29 (Week 29)

    పసిపిల్లలు ఈ దశలో అందరితో కలవడానికి సుముఖత చూపించే కారణంగా బయటకి వెళ్లి కొత్తవాళ్లని కలవాలని ఆరాటపడతారు.

    వారం 30 (Week 30)

    కండరాల బలం ఇంకా సమన్వయం మరింతగా అభివృద్ధి చెందటం కొనసాగుతుంది.

    వారం 31 (Week 31)

    పసిపిల్లలు ఈ సమయంలో చేతులు కట్టుకోవటం చేస్తున్నారు అంటే వారు చేతులని ఉపయోగించే పద్ధతి పూర్తిస్థాయి దశలో ఉన్నదని అర్థం.

    వారం 32 (Week 32)

    పసిపిల్లలు చేతుల పట్టులేకుండా వస్తువులపై వంగటం లేదా ఆనటం వంటివి చేయడం నేర్చుకోవచ్చు.

    8వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (8th Month Baby Milestones)

    వారం 33 (Week 33)

    పసిపిల్లలు వారికి నచ్చినవి, నచ్చనివి వారి సొంత మార్గాలలో వ్యక్తీకరించటం మొదలుపెడతారు.

    వారం 34 (Week 34)

    కాళ్లలో బలం అలాగే సమన్వయం మరింత అభివృద్ధి చెందుతాయి.

    వారం 35 (Week 35)

    కొద్దిమంది పసిపిల్లలు బంతి లేదా సీసా వంటి సామాన్య పదాలని అర్థం చేసుకోవటం మొదలుపెట్టవచ్చు.

    వారం 36 (Week 36)

    పసిపిల్లలు ఈ దశలో వారి అనుభవాల నుండి జ్ఞాపకాలని సృష్టించుకోవడం మొదలుపెట్టవచ్చు.

    9వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (9th Month Baby Milestones in Telugu)

    వారం 37 (Week 37)

    ఈ దశలో కదలిక, ఉత్సుకత రెండూ పూర్తిస్థాయిలో ఉంటాయి.

    వారం 38 (Week 38)

    పసిపిల్లలు కొత్త వస్తువులని చేరుకోవటానికి తాపత్రయపడటం లేదా వాటిని కొట్టడం వంటి వాటితో అల్లరిగా మారవచ్చు.

    వారం 39 (Week 39)

    పసిపిల్లలు ఈ దశలో సాధారణంగా పళ్ల చిగుళ్లు పెరుగుతూ అసౌకర్యంగా ఉండటం లేదా చిన్న వస్తువులని కొడుతూ సమయం గడుపుతారు.

    వారం 40 (Week 40)

    పసిపిల్లలు పరిశీలిస్తూ అనుకరించటం నేర్చుకుంటారు.

    10వ నెల పసిబిడ్డ మైలురాళ్ళు (10th Month Baby Milestones in Telugu)

    వారం 41 (Week 41)

    పసిబిడ్డ తన గురించి,చుట్టుపక్కల గురించి మరింత స్పృహలోకి వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసం యొక్క భావన నెమ్మదిగా వారి మనస్సులలోకి ప్రవేశిస్తుంది.

    వారం 42 (Week 42)

    మెదడు, ఆలోచనాభివృద్ధికి ఇది ముఖ్యమైనది అలాగే ఎదుగుదల కొనసాగే దశ.

    వారం 43 (Week 43)

    పసిపిల్లలకి వస్తువుల శాశ్వత భావనని ఇప్పుడు పరిచయం చేయవచ్చు.

    వారం 44 (Week 44)

    పసిపిల్లలు అన్నీ కొత్తవి ప్రయత్నించటానికి ఉత్సుకతతో ఉంటారు, కొన్నిసార్లు మెట్ల వంటి ప్రమాదకరమైన విషయాలు కూడా.

    11వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (11th Month Baby Milestones in Telugu)

    వారం 45 (Week 45)

    పసిపిల్లలు ఈపాటికి వారంతట వారే తినడం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు.

    వారం 46 (Week 46)

    ఈ దశలో పసిపిల్లల వ్యక్తిత్వం ఏర్పడటం మొదలవ్వచ్చు.

    వారం 47 (Week 47)

    ఉత్సుకత, కొత్తవి ప్రయత్నించటం, అభిప్రాయాలు ఏర్పడటం వంటివి కొనసాగుతాయి.

    వారం 48 (Week 48)

    పసిపిల్లలు ఏదైనా పట్టుకుని అడుగులు వేసే దశలోకి అడుగుపెట్టబోతున్నారు.

    12వ నెల పసిబిడ్డ మైలురాళ్లు (12th Month Baby Milestones in Telugu)

    వారం 49 (Week 49)

    తెలియనివారి చుట్టూ మానసిక ఆందోళన పడటం నెమ్మదిగా తిరిగి రావచ్చు.

    వారం 50 (Week 50)

    పసిపిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తకొత్తగా అనుభూతి చెందుతూనే ఉండటం వలన వారికి ఉత్సాహం, శక్తి అపరిమితంగా ఉంటాయి. అలసట అనేదే ఉండదు.

    వారం 51 (Week 51)

    పసిపిల్లలు తమ పరిమితులని తెలుసుకునే మొదటి పాఠాలని నేర్చుకుంటారు.

    వారం 52 (Week 52)

    ఈపాటికి, చాలామంది పసిపిల్లలు మా లేదా దాదాలాంటి నిర్దేశించిన పేర్లతో అందరినీ పిలవడం మొదలుపెడతారు.

    ఈ గైడ్ కొత్తగా తల్లిదండ్రులైన వారికి జరిగేవాటి గురించి టూకీగా సమాచారం చెప్పగలదు. అయితే, మీ బిడ్డలు దాటే మైలురాళ్ల ఆనందం స్వయంగా అనుభూతి చెందితేనే తెలుస్తుంది

    TAGS :

    Baby Milestones in the First Year of Birth In English, Baby Milestones in the First Year of Birth In Hindi, Baby Milestones in the First Year of Birth In Tamil, Baby Milestones in the First Year of Birth In Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.