Women Specific Issues
3 November 2023 న నవీకరించబడింది
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ అంటే చనుమొన రొమ్ము నుండి బయటకు పొడుచుకొని ఉండని స్థితి. ఈ విధంగా లోపలికి ముడుచుకొని ఉన్న చనుమొన ఒకోసారి తలక్రిందులుగా ఉండే త్రిభుజాకారంగా కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఈ ఇన్వెర్టెడ్ నిప్పల్స్ వల్ల రొమ్ములో నొప్పి ఇంకా చర్మపు కోశాలవంటి ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇలా ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఉన్నవారు, తమ డాక్టరుకి చూపించుకోవాలి ఎందుకంటే ఈ పరిస్థితిని నివారించే చికిత్స ఎంపికలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ విస్తృతంగా ఎందరిలోనో కనిపిస్తున్నప్పటికీ, అవి కొందరిలో రొమ్ము క్యాన్సర్‌కు సంకేతం అవ్వవచ్చు. ఎవరికైనా నిప్పల్స్ లోపలికి ముడుచుకొని ఉన్నట్లు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో అవసరం. మీ రొమ్ములలో ఏదైనా లోపం గాని లేదా ఇన్ఫెక్షన్ గాని ఉండవచ్చు.
ఈ సమస్య గురించి ఆందోళన చెందుతూ ఇంకా ఇందుకోసం తర్వాత ఏం చెయ్యాలో తెలియని వారికోసం ఇక్కడొక టిప్ ఉంది. వెంటనే డాక్టరుని సంప్రదించాలి! శస్త్రచికిత్స వంటి చికిత్స ఎంచుకొనేందుకు వీలుకాకుండా ఉండేంత ఆలస్యం జరగకముందే, సాధ్యమైనంత త్వరగా తగిన సహాయం పొందడం అత్యవసరం.
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ అనేది జన్యుపరంగా, హార్మోన్లు ఇంకా పాలుపట్టడం వల్ల సంభవించే సాధారణమైన పరిస్థితి. గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో లేదా ఒకరి శరీరం ఈస్ట్రోజెన్‌ని (స్త్రీ హార్మోన్) ఉపయోగించుకొనే విధానంపై ప్రభావం చూపించే థైరాయిడ్ వ్యాధిని కూడా కలిగి ఉంటే అందువల్ల కలిగే హార్మోన్ల మార్పులు కూడా ఇన్వెర్టెడ్ నిప్పల్స్కి కారణమవుతాయి. ఒకవేళ ఇన్వెర్టెడ్ నిప్పల్స్ మీకున్నాయని అనిపించి ఆందోళన చెందుతుంటే, దానిని సరిదిద్దేందుకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి మీ డాక్టరుతో మాట్లాడండి.
ఇతర అంతర్లీన శరీర పరిస్థితులు దీనికి కారణం కానట్లయితే, ఇన్వెర్టెడ్ నిప్పల్స్లను శస్త్రచికిత్స ద్వారా సరిదిద్దడానికి వైద్యపరమైన అవసరం లేదు. దీనివల్ల మీరు ఇబ్బందికి గురైనట్లయితే ఇంకా ఆకర్షణీయంగా లేనట్లుగా అసంతృప్తి చెందుతూ ఉంటే, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
కొందరు ఈ ఇన్వెర్టెడ్ నిప్పల్స్కి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు ఇంకా ఇంటి చిట్కాలతో దీనిని పరిష్కరించుకుంటున్నారు. మేము కొన్ని సాధారణ ఇంటి నివారణ చిట్కాల జాబితాను ఇక్కడ పొందుపరిచాము.
మీ చనుమొనను బయటకు లాగడానికి ఒత్తిడితో లాగడం వంటి విధానాన్ని ఉపయోగించడం ద్వారా ఇన్వెర్టెడ్ నిప్పల్స్ రూపాన్ని మెరుగుపరచడానికి బ్రెస్ట్ పంప్ సహాయపడుతుంది.
ఉద్దీపన కలిగించినపుడు చనుమొన పైకి పొడుచుకు వచ్చేలా చేస్తుంది కాబట్టి, ఇన్వెర్టెడ్ నిప్పల్స్ల అత్యంత సాధారణ పరిష్కార విధానాలలో ఇది కూడా ఒకటి.
ఈ పద్ధతి చనుమొన ఉద్దీపనకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. చనుమొన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వొత్తడం కాకుండా, చనుమొన యొక్క ఆధారాన్ని ఇంకా కణజాల ద్రవాలను తిరిగి వారి ఛాతీ వైపుకు నెట్టడం (దీనిని "టెన్టింగ్" అని కూడా అంటారు) చేయాలి.
చాలా మంది మహిళలు ఇన్వెర్టెడ్ నిప్పల్స్కి పరిష్కారం కోసం కుట్లు వేయించుకొనే పద్ధతిపై ఆధారపడతారు. కొందరిలో, ఈ కుట్లు చనుమొనలను వెలుపలికి తేవడంలో అద్భుతంగ పని చేస్తాయి. అయితే, ఇది సంపూర్ణ పరిష్కారం కాదు. అంతేకాక ఇది అందరికీ ఒకేలాగా ఖచ్చితంగా పని చేయదు. దయచేసి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ డాక్టరు గారిని సంప్రదించాలి ఇంకా వారి సలహా తీసుకోవాలి.
ఎవరైనా తక్కువ నిరపాయమైన పద్ధతి ఇంకా శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే ఈ ఇంజెక్షన్ చికిత్స మీకు ఖచ్చితంగా సరిపోతుంది. హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్లు చనుమొనల చర్మం వెనుక ఇంజెక్ట్ చేయబడతాయి. హైలురోనిక్ యాసిడ్ చనుమొనలను మరింత వెలుపలికి తేవడానికి సహాయపడుతుంది. అయితే, ఇది అన్నివేళల అందరికీ ఒకేలాగా పని చేయదని తెలుసుకోవడం అవసరం. మీ వైద్యుడిని సంప్రదించాలని ఇంకా మీ అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాము.
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఉన్నవారు ఎంచుకోదగ్గ రెండు శస్త్రచికిత్స రకాలు ఉన్నాయి. ఒక రకం శస్త్రచికిత్స క్షీర నాళాల సంరక్షణను భరోసా ఇస్తుంది, మరొకటి ఇవ్వదు. క్షీర నాళాల పాక్షిక రక్షణను అందించే మూడవ ఎంపిక కూడా ఉంది.
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ గల తల్లి శిశువుకి పాలు పట్టేటప్పుడు అవి శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తాయి, దీని ఫలితంగా మాస్టిటిస్ (క్షీర గ్రంథుల ఇన్ఫెక్షన్) ఏర్పడవచ్చు, ఇది బ్రెస్ట్ కణజాలంలో నొప్పి ఇంకా వాపుకు కారణమవుతుంది. ఇన్వెర్టెడ్ నిప్పల్స్ కూడా తల్లికి పాలివ్వడంలో ఇబ్బందిని కలిగిస్తాయి, ఎందుకంటే శిశువుకి చనుమొనలను నోటితో పట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, దాని ఫలితంగా తల్లి పాలు వృధా అవుతాయి.
గర్భిణి స్త్రీకి ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఉన్నట్లయితే, వారు వెంటనే తమ వైద్యుడిని సంప్రదించాలి. వారు పాలుపట్టే సమయంలో, చనుమొనల ప్రదేశంలో నొప్పి లేదా అసౌకర్యాన్ని పొందవచ్చు. తల్లిపాలు ఇచ్చే సమయంలో వారి నిప్పల్స్ కూడా లోపలి వైపుకి మరలిపోవచ్చు.
ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఉన్నవారు చికిత్స ఎంపికల గురించి తెలుసుకునేందుకు వారి వైద్యునితో సంప్రదించవచ్చు. సమస్యను సరిచేయడానికి ఇంకా పాలుపట్టడం సులభతరం చేయడానికి కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఇన్వెర్టెడ్ నిప్పల్స్ని బాల్యంలో లేదా చిన్నతనంలో సరిదిద్దకపోతే కూడా అవి సమస్యలను కలిగిస్తాయి. నిప్పల్ అనేది అరియోలా (మీ బ్రెస్ట్ చుట్టూ ఉన్న గులాబీ-రంగు ప్రాంతం) ప్రదేశంలో పెరుగుతుంది ఇంకా ఇది మీ శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే కాస్త పెద్దదిగా కనిపిస్తుంది.
అంతేకాక, ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ స్థాయిల హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడే హార్మోన్ అసమతుల్యత వంటి రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలను కూడా సూచిస్తాయి; జన్యు ఉత్పరివర్తనలు పాల ఉత్పత్తికి దోహదపడే ప్రోలాక్టిన్ హార్మోన్ అధిక స్థాయిలో ఉత్పత్తి అయ్యేందుకు దారితీస్తాయి.
మీకు ఇన్వెర్టెడ్ నిప్పల్స్ ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా చికిత్స ఎంపికల గురించి మీ వైద్యునితో మాట్లాడాలి. సులువైన పరిష్కారాలు లేనప్పటికీ, మీ డాక్టర్ మీ అవసరాలకు అనుగుణంగా మంచి పరిష్కారాన్ని చూపించడంలో మీకు సహాయడగలరు! ఇన్వెర్టెడ్ నిప్పల్స్ కోసం అనేక రకాల చికిత్సా పద్ధతులు ఉన్నాయి
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |