hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మెటా టైటిల్: రొమ్ము క్యాన్సర్, రకాలు, కారణాలు మరియు లక్షణాలు arrow

In this Article

    మెటా టైటిల్: రొమ్ము క్యాన్సర్, రకాలు, కారణాలు మరియు లక్షణాలు

    మెటా టైటిల్: రొమ్ము క్యాన్సర్, రకాలు, కారణాలు మరియు లక్షణాలు

    Updated on 3 November 2023

    అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి?

    కణాల పెరుగుదలను నియంత్రించే జన్యువులలో మ్యుటేషన్ అనే మార్పులు సంభవించినపుడు క్యాన్సర్ వస్తుంది. కణాలను అనియంత్రిత మార్గంలో విభజించేందుకు, అవి గణనీయంగా పెరిగేందుకు మ్యుటేషన్ అనుమతిస్తుంది. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో అభివృద్ధి అవుతుంది. ఇది రొమ్ము యొక్క లోబుల్స్ (తల్లి పాలను ఉత్పత్తి చేసేవి), సన్నని గొట్టాలలో సంభవిస్తుంది. లోబుల్స్ అనేవి పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు. నాళాలు అనేవి పాలను చనుమొనల వరకు తీసుకెళ్లేవి. రొమ్ములోని కొవ్వు కణజాలం అలాగే ఫైబరస్ కనెక్టివ్ కణజాలం (ప్రొటీన్ ఫైబర్​లతో ఏర్పడే కణజాలం) లో క్యాన్సర్ సంభవిస్తుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ములో కంతులు- కారణాలు, చికిత్స

    రొమ్ము క్యాన్సర్ యొక్క 10 ప్రారంభ సంకేతాలు

    1) గడ్డ గుర్తింపు

    మీ వేళ్లతో మీ రొమ్ముల చుట్టు పక్కల ప్రాంతాలను మీ వేళ్లతో ప్రెస్ చేయడం (ఒత్తడం ద్వారా) ద్వారా గడ్డలను గుర్తించవచ్చు. చంక, చనుమొనలు, శోషరస కణాల చుట్టూ గడ్డలు ఏర్పడతాయి.

    2) రొమ్ములలో దురద

    మీ రొమ్ముల చుట్టూ దురద వస్తే..

    3) ఉబ్బి ఉండే రొమ్ములు

    తాకినపుడు వేడిగా అనిపించే మరియు ఎరుపుగా ఉండే చర్మం.

    4) మెడ మరియు భుజంలో నొప్పి

    మీకు వెన్ను లేదా వెనకాల, వెన్నముక భాగంలో నొప్పిగా ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

    5) రొమ్ముల పరిమాణంలో మార్పు

    రొమ్ము కణతి (ట్యూమర్) అనేది మీ రొమ్ముల పరిమాణాన్ని మారుస్తుంది.

    6) రొమ్ములు సున్నితంగా మారడం

    మీ రొమ్ముల్లో ఏర్పడిన గడ్డ అనేది ఒక విత్తనం వలే అభివృద్ధి చెందుతుంది. దీని వల్ల మీరు పడుకున్నపుడు మీ రొమ్ములు సున్నితంగా ఉంటాయి.

    7) చనుమొనల ఉత్సర్గ (బయటకు పంపడం, విడుదల)

    రొమ్ము క్యాన్సర్ అనేది పాల నాళాల్లో ప్రారంభం అవుతుంది. ఇది నీటి రూపంలో, పాలరూపంలో, రక్తం రూపంలో ఉత్సర్గ (బయటకు పంపడం, విడుదల) ను చూపుతుంది.

    8) చనుమొనల సున్నితత్వం

    అసాధారణంగా సున్నితంగా ఉండే చనుమొనలు ఒక్కసారిగా సున్నితత్వాన్ని కోల్పోతాయి. రొమ్ము కణితుల (ట్యూమర్స్) వల్ల ఇది సంభవిస్తుంది.

    9) చనుమొనల మార్పు

    మీరు తల్లిపాలు ఇవ్వకపోయినా.. మీ చనుమొనలు ఫ్లాట్​గా, అసమాన ఆకారంలో ఉంటే..

    10) డింపుల్డ్ రొమ్ము కణజాలం

    రొమ్ముల మీద ఉండే చర్మం ఎరుపు రంగులోకి డింపుల్డ్​గా మారుతుంది. లేదా నారింజ రంగులా చర్మం మారుతుంది.

    రొమ్ము క్యాన్సర్ రకాలు(వ్యాప్తి చెందేవి మరియు వ్యాప్తి చెందనివి)

    1) అసలు స్థానంలో(Situ) డక్టల్ కార్సినోమా (వ్యాప్తి చెందనిది)

    ఇందులో మీలో ఉన్న క్యాన్సర్ కణాలు రొమ్ము నాళాలకు పరిమితం అయి ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న రొమ్ము కణాజాలాలకు వ్యాప్తి చెందలేవు.

    2) అసలు స్థానంలో(Situ) లోబులర్ కార్సినోమా

    ఇది మీ రొమ్ములలో పాలను ఉత్పత్తి చేసే గ్రంథులలో ప్రారంభం అవుతుంది. క్యాన్సర్ కణాలు చుట్టు పక్కల ఉండే ఇతర కణజాలాలను ప్రభావితం చేయవు.

    3) వ్యాప్తి చెందే (ఇన్వాసివ్) డక్టల్ కార్సినోమా

    ఇది మొదటగా మీ రొమ్ము పాల నాళాల్లో ప్రారంభం అవుతుంది. తర్వాత నెమ్మదిగా మీ రొమ్ము ఇతర కణజాలాలకు కూడా వ్యాపిస్తుంది. అనంతరం దగ్గర్లోని ఇతర కణజాలాలకు మరియు ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుంది.

    4) వ్యాప్తి చెందే (ఇన్వాసివ్) లోబులర్ కార్సినోమా

    ఇది మొదట మీ రొమ్ము లోబుల్స్ (పాలను ఉత్పత్తి చేసేవి) లో అభివృద్ధి చెంది తర్వాత ఇతర కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ము నొప్పికి కారణాలు: ఆడవాళ్ళకు రొమ్ము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోండి

    ఇతర రకాలైన సాధారణ రొమ్ము క్యాన్సర్లు

    1) చనుమొన మీద పాజెట్ వ్యాధి (చనుమొన చుట్టూ తామర వ్యాధిలా)

    2) ఫిలోడస్ కణతి (ఒక రకమైన కణతి)

    3) ఆంజియోసార్కోమా (ఒక రకమైన క్యాన్సర్)

    4) ఇన్ఫ్లమేటరీ(కోరికలు పుట్టించే) రొమ్ము క్యాన్సర్

    5) ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్

    రొమ్ము క్యాన్సర్​కు కారణాలు

    మీ రొమ్ములోని అసాధారణ కణాలు వేగంగా రెట్టింపు అయినపుడు మీకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే కొన్ని ప్రమాదకర కారకాలు ఉన్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి.

    1) వయసు

    55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

    2) లింగం (సెక్స్)

    మహిళల్లో ఎక్కువగా వస్తుంది.

    3) కుటుంబ చరిత్ర మరియు జన్యువులు

    మీ తల్లిదండ్రులు, తోబుట్టువుల్లాంటి దగ్గరి వారికి రొమ్ము క్యాన్సర్ ఉంటే మీకు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

    4) ధూమపానం

    పొగాకు (టొబాకో) అనేది రొమ్ము క్యాన్సర్​తో పాటు అనేక రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది.

    5) మద్యపానం

    ఆల్కహాల్ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

    6) ఒబెసిటీ (ఊబకాయం)

    ఊబకాయం అనేది రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రొమ్ము క్యాన్సర్ తిరిగి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

    7) రేడియేషన్ దుష్ప్రభావాలు

    మీరు కనుక తలకు, మెడకు లేదా చాతి భాగంలో రేడియేషన్ థెరపీ చేయించుకుంటూ ఉంటే... మీకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

    8) హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీ

    హార్మోన్ రిప్లేస్​మెంట్ థెరపీని వాడే వ్యక్తులు రొమ్ము క్యాన్సర్​తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    రొమ్ము క్యాన్సర్​కు చికిత్స

    మీ రొమ్ము క్యాన్సర్ దశ, గ్రేడ్, పరిమాణం మరియు రకాన్ని బట్టి మీ రొమ్ము క్యాన్సర్ చికిత్స గురించి మీ వైద్యుడు మీకు సలహా ఇస్తాడు. ఇది మీ ఓవరాల్ ఆరోగ్యం, మీ ఎంపికలపై ఆధారపడి ఉంటుంది.

    రొమ్ము క్యాన్సర్ చికిత్సలు ఇలా ఉన్నాయి.

    i) రొమ్ము క్యాన్సర్ సర్జరీ (శస్త్ర చికిత్స)

    ii) రేడియేషన్ థెరపీ

    iii) కీమోథెరపీ

    iv) హార్మోన్ థెరపీ

    v) మందులు ఇస్తూ చికిత్స చేయడం

    vi) ఇమ్యూనోథెరపీ

    vii) సహాయక (పాలియేటివ్) సంరక్షణ

    చివరగా

    రొమ్ము క్యాన్సర్​కు సంబంధించిన అన్ని వాస్తవాలను గురించి తెలుసుకోండి. మీలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. సకాలంలో పరీక్షలు, మీ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడం, ఏవైనా గడ్డలను గుర్తిస్తే వెంటనే నిర్ధారణకు వెళ్లండి. మహిళలు 40 సంవత్సరాల నుంచి వార్షిక మామోగ్రామ్(రొమ్ము క్యాన్సర్​ను గుర్తించే ఒక రకమైన స్కానింగ్) చేయించుకోవాలి. ఇది ముందుగానే రోగ నిర్ధారణ చేసేందుకు మరియు చికిత్స చేసేందుకు ఉపయోగపడుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.