hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Baby Care arrow
  • మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం? arrow

In this Article

    మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?

    Baby Care

    మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?

    3 November 2023 న నవీకరించబడింది

    మీ శిశువుకు బేబీ మసాజ్ ఆయిల్ నుండి ప్రయోజనం లభిస్తుంది. దాని వల్ల మీకు ప్రశాంతంగా అనిపించడం కూడా మీరు గమనించవచ్చు. మీరు సరైన మసాజ్ ఆయిల్‌ ఉపయోగించడం ద్వారా మీ బిడ్డ శ్రేయస్సుకు దోహదపడవచ్చు. అదే సమయంలో మీ శిశువు సున్నితమైన చర్మాన్ని సంరక్షించడానికి, తేమగా ఉంచడానికి మీరు మసాజ్ ఆయిల్ ఉపయోగించవచ్చు.

    ఇక్కడ సమస్య ఏమిటంటే అన్ని నూనెలు సమానంగా తయారు కావు. శిశువు చర్మానికి అన్నీ అద్భుతమైనవి కావు. బేబీ మసాజ్ కోసం "సహజమైన" నూనెను వాడినంత మాత్రాన అది సురక్షితమైనదన్న హామీ లేదు.

    శిశువులకు మసాజ్ చేయడానికి ఏ నూనెలు అనువైనవి, ఏవి నివారించాలో మనం ఇక్కడ చూద్దాం.

    బేబీ మసాజ్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది:

    క్రమం తప్పకుండా చేసే బేబీ మసాజ్‌లు మీకు, మీ పిల్లల మధ్య సన్నిహిత సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. స్పర్శ అనేది పెద్దలు, శిశువులు ఇద్దరూ అర్థం చేసుకోగలిగే సార్వత్రిక భాష. బేబీ మసాజ్‌ వల్ల మీరు, మీ బిడ్డ ఇద్దరూ ప్రయోజనం పొందుతారు!

    మీరు, మీ బిడ్డ బేబీ మసాజ్ సమయంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూస్తుంటారు. డైపర్ కూడా ఉండదు. మీరు మీ శిశువుకు చూపించే ముఖ కవళికలు వారు తమ భావాలు వ్యక్తీకరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. తరచుగా మసాజ్ చేయడం వల్ల మీ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది.

    ఉత్తమమైన నూనెలు ఏవి?

    బలమైన ఎముకల కోసం శిశువు యొక్క సున్నితమైన చర్మంపై ఉపయోగించడానికి అనువైన అనేక బేబీ మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి. మీ పిల్లల చర్మాన్ని మసాజ్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి ఈ నూనెలను ఉపయోగించండి. కొన్ని ఉత్పత్తులు మీ శిశువు చర్మానికి మిగతా వాటికన్నా ఎక్కువ నప్పుతాయి.

    శిశు మసాజ్ కోసం అత్యుత్తమ నూనెలు

    • కొబ్బరి నూనె

    2020లో ప్రచురించబడిన వైద్య పరిశోధన ప్రకారం, వర్జిన్ కొబ్బరి నూనెను పూయడం వల్ల నెలలు నిండని శిశువుల చర్మం మెరుగుపడి బలపడింది. దీనిని శిశువులు, పెద్ద పిల్లలకు మసాజ్ ఆయిల్‌గా, మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ఈ ఫలితాలకు అనేక అదనపు అధ్యయనాల ద్వారా మద్దతు లభించింది అయితే ఇంకా తదుపరి అధ్యయనం చేయడం అవసరం.

    • బాదాం నూనె

    2020 నుండి క్లినికల్ అధ్యయనం ప్రకారం విటమిన్ ఇ అధికంగా ఉండే బాదాం నూనెను బేబీ మసాజ్ ఆయిల్‌గా ఉపయోగించడం సురక్షితం. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు బాదాం నూనెను పూయడం వల్ల చర్మం మందాన్ని, బలాన్ని పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎలాంటి చెడు ప్రభావాలు కూడా కనిపించలేదని తేల్చారు.

    • పెట్రోలియం జెల్లీ

    బేబీ లోషన్‌ విషయానికి వస్తే, మీ తల్లి పెట్రోలియం ఆయింట్‌మెంట్ లేదా జెల్లీని (వాసెలిన్ అనే బ్రాండ్ పేరుతో కూడా పిలుస్తారు) ఉపయోగించి ఉండవచ్చు, ఎందుకంటే ఇది మీ బిడ్డ చర్మానికి మసాజ్ ఆయిల్‌గా ఉపయోగపడుతుంది.

    • బేబీ ఆయిల్

    "అత్యుత్తమ బేబీ మసాజ్ ఆయిల్" అని తరచుగా పేరున్న మినరల్ ఆయిల్ నిజంగా అత్యుత్తమమైనదే. 2012లో వైద్య అధ్యయనం ప్రకారం.. పెట్రోలియం జెల్లీతో సహా మినరల్ ఆయిల్‌ శిశువుల చర్మానికి హానికరం కాదని తేలింది.

    • షియా బటర్

    మీ శిశువు సున్నితమైన చర్మంపై షియా బటర్‌ ఉపయోగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్. ఇది ఉపయోగించడానికి తగినంత సౌమ్యంగా ఉంటుంది. స్వచ్ఛమైన షియా బటర్‌లో అదనపు రసాయనాలు లేదా సువాసనలు ఉండవు

    • కుసుమ నూనె (సాఫ్లవర్ ఆయిల్ )

    విటమిన్ ఇ అధికంగా ఉండే కుసుమ నూనె కోల్డ్ ప్రెస్డ్ వెజిటబుల్ ఆయిల్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇతర నూనెల తరహాలో ఎక్కువ ప్రాసెసింగ్ అవదు. ఫలితంగా, బేబీ నైట్ మసాజ్ ఆయిల్ గా వాడటానికి ఇది అద్భుతమైన ఎంపిక.

    • గ్రేప్ సీడ్ ఆయిల్

    చాలా సందర్భాలలో మీరు మీ శిశువు యొక్క మసాజ్ రొటీన్‌లో కోల్డ్-ప్రెస్డ్ గ్రేప్‌సీడ్ బేబీ మసాజ్ నూనెలను సురక్షితంగా ఉపయోగించవచ్చు

    • కెమొమైల్ లోషన్

    నవజాత శిశువుకు కలిగే తామర, డైపర్-రాష్ ఉపశమనానికి ప్రభావవంతంగా ఉండటంతో పాటు, మీరు మీ శిశువుకు మసాజ్ ఆయిల్‌గా కూడా కెమొమైల్ లోషన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తితో మీ పిల్లల చర్మం మృదువుగా ఉండటం‌తో పాటు స్వస్థత కూడా చేకూరుస్తుంది.

    • జోజోబా నూనె

    ఇది చర్మానికి స్వస్థత చేకూర్చడంలో సహాయపడుతుంది కాబట్టి, జొజోబా ఆయిల్ తరచుగా తామరతో ఉన్న నవజాత శిశువులకు సిఫారసు చేస్తారు. ఈ ఉత్పత్తిలో విటమిన్ ఇ కూడా గణనీయమైన సాంద్రతలలో కనిపిస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ జొజోబా నూనెతో మీ శిశువుకు మసాజ్ చేయండి.

    • బోరేజ్ సీడ్ ఆయిల్

    మీరు కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న బోరేజ్ సీడ్ ఆయిల్‌ని ఉపయోగించి మీ శిశువు చర్మాన్ని శాంతపరచడంతో పాటు చికిత్స కూడా చేయవచ్చు. మీ శిశువుకు ఎగ్జిమా ఉన్నప్పటికీ, మీరు దానిని మసాజ్ ఆయిల్‌గా ఉపయోగించవచ్చు.

    • రోజ్‌షిప్ ఆయిల్

    రోజ్‌షిప్ ఆయిల్‌లో లిపిడ్‌ల అధిక సాంద్రత ఉంటుంది, ఇది శిశువు చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది. దాని అభివృద్ధికి సహాయపడుతుంది. బేబీ ఎగ్జిమా, ఇతర చర్మపు దద్దుర్లు ఎరుపు, మంటను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఇది ఉత్తమ బేబీ మసాజ్ ఆయిల్.

    • ఓట్ ఆయిల్

    మీ బాడీ లోషన్ ఓట్ నూనెను "అవెనా సాటివా"గా గుర్తించవచ్చు. ఈ కంపోనెంట్ వల్ల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో చర్మ దద్దుర్లు, పొడి, దురద చర్మానికి స్వస్థత చేకూర్చడంలో సహాయపడవచ్చు.

    సాధారణంగా, ఓట్ ఆయిల్ పిల్లల చర్మానికి మంచి ఎంపిక గా భావిస్తారు.

    మూలం:

    ది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్: కేరింగ్ ఫర్ యువర్ బేబీ అండ్ యంగ్ చైల్డ్.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.