hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Vaccinations arrow
  • గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu arrow

In this Article

    గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu

    Vaccinations

    గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu

    1 January 2024 న నవీకరించబడింది

    గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు ఫ్లూ లేదా ఇన్‌ఫ్లుయెంజా సంబంధిత సమస్యల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే, ఫ్లూ కారణంగా గర్భస్థ శిశువుకు కూడా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. వైద్యుల సమాచారం ప్రకారం, ఇతర మహిళలతో పోలిస్తే గర్భిణీలకు ఎక్కువగా ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నాయి. వారి ఫ్లూ లక్షణాలు మరిన్ని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే వారిని దగ్గరగా పర్యవేక్షిస్తూ, వారి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

    గర్భిణీల్లో ఇన్‌ఫ్లుయెంజా కారణంగా మరణాలు, ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఫ్లూ గురించి తెలుసుకొని గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత అది సోకకుండా అప్రమత్తంగా ఉండటం అవసరం. ఫ్లూ బారిన పడకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం. గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అన్న సందేహం మీకు కూడా ఉందా? అయితే గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. పేషెంట్‌ను బట్టి వైద్యుల సూచనలు ఉండొచ్చు. ఫ్లూ నివారణలో ఫ్లూ వాక్సిన్ తీసుకోవడం మొదటి, కీలకమైన నిర్ణయం. ఇక రెండో రక్షణ శ్రేణిగా ఫ్లూ యాంటీవైరల్ డ్రగ్స్ ఉపయోగించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది. గర్భధారణ సమయంలో టీకాలు: గర్భధారణ సమయంలో TT ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ (Influenza Vaccine Dose in pregnancy in Telugu)

    వైద్య సమాచారం ప్రకారం, గర్భిణీలు వారి శరీరంలో తరచూ మార్పులు జరుగుతుంటాయి కాబట్టి, ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అందుకే సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉండాలి. గర్భిణీల్లో రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండెలో మార్పులు ఉంటాయి. అలాంటివారు ఫ్లూబారిన సులువుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చుట్టూ గాలిలో ఉండే ఫ్లూతో వారికి రిస్క్ ఉంటుంది. దీంతో పాటు, ఫ్లూ సోకిన తర్వాత దానితో పోరాడి బయటపడటం కష్టంగా మారుతుంది. అదే వయస్సులో ఉన్న ఇతర మహిళలతో పోలిస్తే, గర్భిణీలు ఫ్లూతో పోరాడటం కష్టం. అందుకే ఫ్లూ సోకకుండా గర్భవతులు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. గర్భవతులు వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్లూ సోకే అవకాశాలను బాగా తగ్గించవచ్చు. ఒకవేళ సోకినా, ఆస్పత్రులో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రాకపోవచ్చు.

    గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తమను కాపాడుకోవడం మాత్రమే కాదు, కడుపులో పెరుగుతున్న తమ బిడ్డను కూడా వైరల్ ఇన్‌ఫ్లుయెంజా నుంచి కాపాడినట్టవుతుంది. కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు వారిని కాపాడవచ్చు. ఎందుకంటే పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు వారికి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వరు కాబట్టి.

    గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల లాభాలు, నష్టాలు

    ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం. హెల్త్‌లైన్ సమాచారం ప్రకారం గర్భవతులు ప్రతీ ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సీజనల్ ఫ్లూ షాట్ తీసుకోవడానికి నిర్ణీత సమయం అంటూ ఏమీ లేదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ చెబుతోంది. అయినా.. గర్భవతులు ఫ్లూ షాట్ తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి, వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రభావాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ షాట్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకోండి. -

    లాభాలు

    • బిడ్డ పుట్టిన తర్వాత రక్షణగా నిలవడం.
    • యాంటీ ఇన్‌ఫ్లుయెంజా యాంటీబాడీస్ తల్లిపాల ద్వారా పిల్లల శరీరంలోకి వెళ్లి వారికి రక్షణగా నిలిచే అవకాశం ఉండటం.
    • గర్భంతో ఉన్నప్పుడు శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండటం.
    • శిశువు అభివృద్ధిలో హానిని తగ్గించడం.
    • శిశువుకు ప్రసూతి సంబంధిత సమస్యలు రాకుండా నివారించడం.
    • కడుపులోని పిండానికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడటం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది. శిశువు శ్వాసలోపం గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

    ఇక ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. అయితే సమస్యల్ని, రిస్కుల్ని నిరోధించడానికి వ్యాక్సిన్ తీసుకునే ముందు వైద్యులతో మాట్లాడాలి. ప్రత్యేకించి, మీరు ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టైతే, ఆలస్యంగా గర్భం దాలిస్తే వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఫ్లూ వ్యాక్సిన్లకు, గర్భస్రావాలకు సంబంధం ఉండొచ్చని అంటుంటారు. అయితే ఇది నిరూపించబడలేదు. అందుకే మీ శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

    ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్లూ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు

    గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి.

    • ఎరుపెక్కడం, వాపు, నొప్పి.
    • సున్నితత్వం.
    • జ్వరం.
    • తలనొప్పి.
    • అలసట.
    • వికారం.
    • కండరాల నొప్పి

    గర్భవతిగా ఉన్నప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఉండొచ్చు. అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సాధారణమే కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అసరం లేదు. నిజానికి, ఈ దుష్ప్రభావాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. అయితే ఏదైనా అత్యవసరం అయినా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాలం ఉన్నా వైద్యులను కలవాలి.

    గర్భవతిగా ఉన్నప్పుడు మూడో ట్రమిస్టర్‌లో ఫ్లూ షాట్ తీసుకోవచ్చా?

    తీసుకోవచ్చు. CDC, ACOG ప్రకారం గర్భవతిగా ఉన్నప్పుడు మూడో ట్రమిస్టర్‌లో ఫ్లూ షాట్ తీసుకోవడం సురక్షితమే.

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమేనా?

    అవును. గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం మాత్రమే కాదు, వైద్యులు వద్దంటే తప్ప వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత సిఫార్సు చేయబడిన అంశం.

    References

    1. SteelFisher GK, Caporello HL, Broussard CS, Schafer TJ, Ben-Porath EN, Blendon RJ. (2021). Seasonal Influenza Vaccine in Pregnant Women: Views and Experiences of Obstetrician-Gynecologists. J Womens Health (Larchmt).

    2. Mother To Baby | Fact Sheets [Internet]. (1994). Brentwood (TN): Organization of Teratology Information Specialists. Seasonal Influenza Vaccine (Flu Shot)

    Tags
    How many injection during pregnancy in Telugu, Vaccines during Pregnancy in Telugu, Vaccines for Pregnant women in Telugu, Should Pregnant Women Get Flu Shots in English, Should Pregnant Women Get Flu Shots in Tamil

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.