hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy arrow
  • గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & మార్గదర్శకాలు arrow

In this Article

    గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & మార్గదర్శకాలు

    Pregnancy

    గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & మార్గదర్శకాలు

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) తినడం సురక్షితమేనా?

    గర్భంతో ఉన్న సమయంలో నేను బేరి పండు (పియర్ ఫ్రూట్​) తినొచ్చా? గర్భంతో ఉన్నపుడు బేరి పండ్లను నిశ్చింతగా తినొచ్చు. ఏ ఆహారాన్నైనా తినే ముందు శుభ్రంగా కడగడం అవసరం. అలాగే బేరి పండ్లను (పియర్​ ఫ్రూట్​)కూడా శుభ్రంగా కడగాలి. బాగా పండిన బేరి పండ్లను (పియర్ ఫ్రూట్​) మీరు దూరం పెట్టాలని అనుకోవచ్చు. ఎందుకంటే బాగా పండిన పండ్లలో మీ కడుపులోని బిడ్డకు హాని కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. మీరు మీ ప్రెగ్నెన్సీ డైట్​లో జోడించేందుకు అధిక విటమిన్లు ఉండే పండు కోసం చూస్తున్నట్లయితే మీకు బేరి పండు (పియర్​ ఫ్రూట్) గొప్ప ఎంపిక. వీటిని తినే ముందు బాగా కడగాలి. అలాగే అతిగా పండిన బేరి పండును (పియర్ ఫ్రూట్) తినకుండా ఉండాలి.

    గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్స్) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

    మీరు గర్భవతిగా ఉన్నారా... మీ ఆహారంలో రుచికరమైన పండ్లను యాడ్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారా? అలా అయితే మీరు బేరి పండును (పియర్ ఫ్రూట్​) పరిగణలోనికి తీసుకోవచ్చు. బేరి పండు (పియర్ ఫ్రూట్) వలన గర్భధారణ సమయంలో కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

    • బేరి పండ్లలో (పియర్ ఫ్రూట్) ఫైబర్, విటమిన్ C, పొటాషియం వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పైన పేర్కొన్న విటమిన్లు మినరల్స్​కు బేరి పండు (పియర్ ఫ్రూట్) ఒక గొప్ప మూలం. ఈ మూలకాలు గర్భధారణ సమయంలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తాయి. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉండి.. అధిక పోషక విలువలను అందిస్తాయి. గర్భధారణ సమయంలో వీటిని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
    • బేరి పండ్ల (పియర్ ఫ్రూట్​)లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యం మరియు మీ బిడ్డ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
    • బేరి పండ్ల (పియర్​ ఫ్రూట్​)లో ఉండే ఫైబర్ కంటెంట్ మీ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. గర్భధారణ సమయంలో అత్యంత సాధారణ ఆందోళనల్లో ఇదీ ఒకటి.
    • ఇవి మాత్రమే కాకుండా అదనంగా గర్భధారణ సమయంలో బేరి పండు (పియర్ ఫ్రూట్) తినడం వల్ల శరీరంలో మంచి స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఏర్పడతాయి. యాంటీఆక్సిడెంట్లకు ఇది గొప్ప మూలం. ఇది కణాలను దెబ్బతినకుండా ఉంచడంలో, కణాల పునరుత్పత్తిలో సహాయం చేస్తుంది.
    • గర్భధారణ సమయంలో బేరి పండ్లు (పియర్ ఫ్రూట్స్) తినడం వల్ల కలిగే ప్రమాదాలు

    బేరి పండు (పియర్ ఫ్రూట్​) ఒక రుచికరమైన, ఎన్నో పోషకాలు ఉన్న ఒక పండు. కానీ గర్భవతులు ఈ పండ్లను తినే ముందు పరిగణించాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

    • బేరి పండు (పియర్ ఫ్రూట్)లో సార్బిటాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వలన కొంత మందిలో విరేచనాలు కావొచ్చు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఇప్పటికే డయేరియా, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇది మరింత సమస్యగా మారొచ్చు. మీరు కనుక బేరి పండ్లను (పియర్ ఫ్రూట్​) తీసుకుంటే ఎక్కువ మొత్తంలో నీటిని లేదా ఇతర ద్రవాలను తీసుకుని హైడ్రేట్​గా ఉండేందుకు ప్రయత్నించండి.
    • గర్భధారణ సమయంలో బేరి పండు (పియర్ ఫ్రూట్​) తినడం వల్ల కలిగే ఇంకో ప్రమాదం పురుగు మందుల వలన కలిగే దుష్ప్రభావాలు. బేరి పండ్లకు (పియర్ ఫ్రూట్​) తరుచుగా పురుగుమందులు పిచికారీ చేస్తారు. కావున వాటిని తినే ముందు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగడం మంచిది. మీరు ఈ ప్రమాదాన్ని నివారించిందేందుకు ఆర్గానిక్ (ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించిన పంటలు) బేరి పండ్లను (పియర్ ఫ్రూట్​) కూడా కొనుగోలు చేయొచ్చు.
    • బేరి పండ్ల (పియర్ ఫ్రూట్​)లో కొంత మోతాదులో చెక్కెర ఉంటుంది. చెక్కెర అనేది మీకు చెడ్డది కానప్పటికీ గర్భధారణ సమయంలో దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. గర్భంతో ఉన్న స్త్రీకి గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే వారు బేరి పండ్ల(పియర్ ఫ్రూట్​) తీసుకోవడాన్ని తగ్గించాలని అనుకోవచ్చు. కేవలం బేరి పండు మాత్రమే కాకుండా తీపిగా ఉండే ఏ ఇతర పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవద్దు.
    • చివరగా చెప్పొచ్చేదేంటంటే.. బేరి (పియర్ ఫ్రూట్​) పండును తక్కువ మోతాదులో తినాలి. ఎందుకంటే అధిక మొత్తంలో సార్బిటాల్ తీసుకోవడం వలన మనకు విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా గర్భిణీ స్త్రీలు పోషకాహారం కోసం వారి ఆహారంలో ఇతర పండ్లు కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

    గర్భిణీ స్త్రీ ఎన్ని బేరి పండ్లు (పియర్ ఫ్రూట్స్​) తినాలి?

    బేరి పండు (పియర్​ ఫ్రూట్​) లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ అధిక పోషక విలువలు ఉంటాయి. అందువల్ల గర్భధారణ సమయంలో దీనిని తీసుకోవడం మంచిదే. గర్భవతి కావాలని ఆశించే స్త్రీలను రోజుకు 1నుంచి 2 మిడ్ సైజ్ బేరి పండ్లు (పియర్ ఫ్రూట్​) తినమని సూచిస్తారు. బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) లాక్సేటివ్ (మన జీర్ణాశయంలోని ప్రతి దానిని పల్చగా చేసే సత్తా ఉన్నది) ఎఫెక్ట్​ను కలిగి ఉండడం వలన అంతకంటే ఎక్కువగా తింటే విరేచనాలు కావొచ్చు.

    నేను బేరి పండ్లను (పియర్​ ఫ్రూట్స్​) ఎలా ఎంచుకోవాలి? ఎలా నిల్వచేయాలి?

    మీ బేరి పండును (పియర్ ఫ్రూట్​) కొనుగోలు చేసినపుడు అవి ధృడంగా (మెత్తబడని) ఉన్నాయని, వాటి మీద ఎటువంటి మచ్చలు ఉండకుండా చూసుకోండి. మీరు కొనుగోలు చేసిన బేరి (పియర్ ఫ్రూట్​) పూర్తిగా పక్వానికి రాకపోతే.. అవి పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక బేరి (పియర్ ఫ్రూట్) ఎక్కువగా పండితే (చాలా పక్వానికి వస్తే) దానిని గర్భవతులు తినకుండా ఉండడమే మంచిది. బేరి పండు (పియర్ ఫ్రూట్​) ని కాగితం లేదా ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్​లో ఉంచండి.

    మీ గర్భధారణ డైట్​లో బేరి పండుని (పియర్ ఫ్రూట్​) ఎలా జోడించవచ్చు?

    బేరి పండు (పియర్ ఫ్రూట్)ని గర్భధారణ సమయంలో ఒక్కదానినే తినొచ్చు. వేరుశనగ వెన్న లేదా హమ్మస్ వంటి వాటితో ఫ్రూట్​ బౌల్స్​లో స్నాక్స్​గా తినవచ్చు. బేరీ పండుని (పియర్​ ఫ్రూట్​) ఉడకబెట్టి పియర్ సాస్​లను ఏర్పరచుకోవచ్చు. శీతాకాలంలో బ్రెడ్ మరియు కేక్‌లకు ఇవి తోడుగా ఉంటాయి. కానీ బేరీ పండు (పియర్ ఫ్రూట్​)ని ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల దానిలో ఉన్న పోషకాలు పోతాయి. అందుకోసమే ఆ పండుని అలాగే తినమని సిఫారసు చేయబడింది.

    తరచూ అడిగే ప్రశ్నలు

    మీరు గర్భవతిగా ఉన్నపుడు బేరి పండు తొక్క (పియర్ స్కిన్) తినడం మంచిదేనా?

    A1. అవును. గర్భధారణ సమయంలో బేరి పండును (పియర్​ ఫ్రూట్​) తొక్కతో కలిపి తినడం సురక్షితమే. గర్భధారణ సమయంలో బేరి పండు (పియర్​ ఫ్రూట్​) తొక్క వలన శరీరానికి హాని కలుగుతుందని చెప్పే ఎటువంటి పరిశోధనలు లేవు. అయితే ఇతర పండ్లు, కూరగాయల వలే బేరి పండును (పియర్ ఫ్రూట్​) కూడా తినే ముందు బాగా కడుక్కొని తినండి.

    బేరి పండ్లను (పియర్ ఫ్రూట్స్​) తినడం వల్ల గ్యాస్ ఏర్పడుతుందా?

    A2. ఎక్కువ మొత్తంలో సార్బిటాల్ మరియు ఫ్రక్టోస్ (పండ్లలో ఉండే చెక్కెర) ఉండడం వల్ల గర్భధారణ సమయంలో ఎక్కువ బేరి పండ్లు (పియర్ ఫ్రూట్) తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం ఏర్పడవచ్చు. ఇది డయేరియా(విరేచనాలు)కు, కడుపునొప్పికి కూడా దారి తీస్తుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.