hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం arrow

In this Article

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భిణీ స్త్రీకి ఆరోగ్యకరమైన ఆహారమే సర్వస్వం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మీ ఆహారంపై మాత్రమే కాకుండా.. మీ శిశువు యొక్క మొత్తం అభివృద్ధి ఇంకా పెరుగుదలకు మీరు బాధ్యత వహిస్తారు. కాబట్టి పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఇంకా అన్ని ఇతర ముఖ్యమైన పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లి కాబోయే స్త్రీలు, శిశువు యొక్క మొత్తం అభివృద్ధికి సహాయపడే ఆహారాన్ని తీసుకోవడం, గర్భధారణ సమయంలో తలెత్తే ఏవైనా సమస్యలను నివారించడం చాలా ముఖ్యం. దీన్ని బట్టి గర్భధారణ సమయంలో ఆప్రికాట్ పండు ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మీరు గర్భధారణ కోసం ఎండిన ఆప్రికాట్‌లను తినవచ్చా లేదా గర్భధారణ సమయంలో ఎండిన ఆప్రికాట్‌లను తినవచ్చా లేదా అని ఆలోచిస్తున్నారా? గర్భధారణ సమయంలో ఎండిన ఆప్రికాట్‌ పండు తినడం గురించి మీరు తెలుసుకోవలసిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ అందించాము.

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తినడం సురక్షితమేనా?

    ఈ ప్రశ్నకు సమాధానం, అవును. ఆప్రికాట్స్ సాధారణంగా గర్భిణీ స్త్రీలు వినియోగించడానికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. గర్భధారణ సమయంలో మీరు ఎటువంటి సందేహం లేకుండా ఆప్రికాట్‌ను తినవచ్చు. గర్భధారణ సమయంలో ఎండిన ఆప్రికాట్ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆప్రికాట్స్ పండ్లు పీచెస్, చెర్రీస్, బాదం ఇంకా రేగు వంటి పండ్ల కుటుంబం నుండి వస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇంకా గర్భధారణ సమయంలో తినడం మంచిది. మీ రోజువారీ ఆహారంలో కొన్ని ఆప్రికాట్‌లను చేర్చడం ద్వారా మీకు, ఇంకా మీ బిడ్డకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ.. ఆప్రికాట్‌లో హానికరమైన రసాయనాలు లేదా పురుగు మందులు ఉండకుండా, తినేముందు బాగా శుభ్రం చేయడం ముఖ్యం అని గుర్తుంచుకోండి.

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం -

    1. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

    ఆప్రికాట్ తీసుకోవడం ద్వారా శరీరానికి చాలా కెరోటిన్లు అందుతాయి. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

    2. రక్తహీనతను నివారిస్తుంది:

    ఆప్రికాట్‌లో ఇనుము ఉంటుంది. ఇది రక్తహీనతను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

    3. మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది:

    ఆప్రికాట్స్ శరీరానికి చాలా ఫైబర్‌ని అందిస్తాయి. మలబద్ధకం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతాయి.

    4. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:

    ఆప్రికాట్స్ శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

    5. చర్మానికి మంచిది:

    ఈ పండ్లు చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి, కాంతిని ఇస్తాయి.

    6. చనుబాల ఉత్పత్తికి తోడ్పడతాయి:

    ఆప్రికాట్స్ స్త్రీలకు చనుబాలను ఎక్కువ ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

    7. శిశువుకు మంచిది:

    మీ శిశువు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం; ఆప్రికాట్స్‌లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ శిశువు యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడుతుంది. నవజాత శిశువులలో పుట్టుకతో వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్‌ను తినడం వల్ల కలిగే ప్రభావాలు

    గర్భధారణ సమయంలో స్త్రీ సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ప్రతిదీ మితంగా తినాలి. అలాగే ఆప్రికాట్ విషయంలో కూడా అంతే - అది ఎండనదైనా పచ్చిదైనా సరే. గర్భిణీ స్త్రీలు ఆప్రికాట్ తినడం మంచిదిగా పరిగణించబడుతున్నప్పటికీ.. ఎటువంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని రాకుండా ఉండటానికి వాటిని మితంగా తినడం చాలా ముఖ్యం.

    కొంతమందికి.. గర్భధారణ సమయంలో ఎండిన ఆప్రికాట్ తీసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కలిగవచ్చు. సాధారణంగా ఆప్రికాట్‌ను తీసుకోవడం మంచిదే అయినప్పటికీ ఈ కింది వాటిని గుర్తుంచుకోండి:

    • ఆప్రికాట్స్ సరిగ్గా పండకపోతే.. వాటిని తినడం వల్ల స్త్రీల ప్రేగు కదలికలలో అసౌకర్యం కలుగవచ్చు. గర్భిణీ స్త్రీలు, పండనిది లేదా పక్వానికి రాని ఆప్రికాట్‌ను తినడం వల్ల వారికి కడుపులో అసౌకర్యంగా ఉండవచ్చు.
    • ఆప్రికాట్‌ వల్ల మీకు అలెర్జీ లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తినడం మంచిది. ఎందుకంటే అవి అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు.
    • ఆప్రికాట్‌లో సల్ఫర్ డయాక్సైడ్ అనే మూలకం ఉంటుంది కాబట్టి, గర్భిణీ స్త్రీలు సల్ఫైట్‌కు అలెర్జీ కలగదని నిర్ధారించుకోవడం మంచిది. మీరు సల్ఫైట్‌కు అలెర్జీ కలిగే పరిస్థితి ఉంటే.. ఆప్రికాట్‌ను తీసుకోవడం వల్ల అలెర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు.
    • ఆప్రికాట్స్‌లో అమిగ్డాలిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పండు కొసభాగంలో ఉంటుంది. ఆప్రికాట్స్‌ను తినేటప్పుడు ఇది మీ శరీరానికి హాని కలిగిస్తుందని తెలిసినందున మీరు ఈ భాగాన్ని తొలగించి తీసుకోండి.

    గర్భవతిగా ఉన్నప్పుడు ఎండిన ఆప్రికాట్స్‌ను ఎప్పుడు? ఎలా తినాలి?

    గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్‌ను ఎండబెట్టి లేదా పండులాగా తినవచ్చు. తినడానికి ముందు ఆప్రికాట్‌ను శుభ్రంగా కడగాలి. ఆప్రికాట్‌‌లో అమిగ్డాలిన్ ఉన్నందున.. వినియోగానికి ముందు ఆప్రికాట్ కొసను కత్తిరించండి. ఇది వినియోగానికి ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు. గర్భధారణ సమయంలో ఎండిన ఆప్రికాట్ తీసుకోవడం గురించిన మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని మేము ఆశిస్తున్నాము. ఆప్రికాట్స్‌ను అనేక రకాలుగా తినవచ్చు - కొన్ని అత్తి పండ్లను, వాల్‌నట్‌లతో సలాడ్‌లో భాగంగా ఆస్వాదించండి, స్మూతీకి జోడించండి, లేదా మీ అల్పాహారంలో భాగంగా కూడా తినండి, కొన్ని తృణధాన్యాలు, బాదం పప్పులతో కలిపి తినండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.