hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART

In this Article

    గర్భధారణ సమయంలో మామిడిపండు

    Pregnancy Journey

    గర్భధారణ సమయంలో మామిడిపండు

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ సమయంలో మామిడి తినడం సురక్షితమేనా?

    గర్భవతిగా ఉన్నపుడు మామిడిపండ్లు సురక్షితమే. గర్భధారణ సమయంలో మామిడి తినడం గర్భవతులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.

    • గాయాలను నయం చేసేందుకు, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, మీ చిన్నారి దంతాలు మరియు ఎముకలు సరైన విధంగా పెరిగేందుకు విటమిన్ C అనేది చాలా ముఖ్యం.
    • విటమిన్ A శిశువు సాధారణంగా ఎదిగేందుకు, అభివృద్ధి చెందేందుకు అవసరం అవుతుంది. అంతే కాకుండా ఇది గర్భిణీ స్త్రీలను రేచీకటి నుంచి కాపాడుతుంది.
    • మార్నింగ్ సిక్​నెస్ తగ్గించడంలో విటమిన్ B6 సహాయపడుతుంది.
    • పిండంలో మెదడు మరియు వెన్నుపాముకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు. ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ ఈ ప్రమాదాలను తగ్గిస్తాయి.
    • మలవిసర్జన సమస్య ఉన్న గర్భిణీలకు ఫైబర్ సహాయపడుతుంది.

    గర్భధారణ సమయంలో మామిడిపండ్లను ఎక్కువగా తినడం ప్రమాదకరమా?

    గర్భధారణ సమయంలో నేను మామిడిపండ్లను తినొచ్చా? దీనికి సమాధానం అవును. మీరు నిశ్చింతగా మామిడిపండ్లను తినొచ్చు. మామిడిపండ్లలో అధిక కేలరీలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఒకటి కంటే ఎక్కువ మామిడిపండ్లను తినడం ద్వారా త్వరగా బరువు పెరుగుతారు.

    గర్భధారణ సమయంలో మామిడిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

    ఐరన్​ను సంగ్రహించేందుకు అవసరమైన విటమిన్ Cని మామిడిపండ్లు అందజేస్తాయి. అంతకు మించి పిండం అభివృద్ధికి హాని కలిగించే, ప్రాణాంతక కణతులను ఉత్పత్తి చేసే ఫ్రీ రాడికల్స్​తో పోరాడడానికి ఇవి సహాయపడతాయి.

    • గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో మామిడిపండు తినడం వలన నరాలకు సంబంధించిన అసాధారణతలు తగ్గుతాయి. పిండం నాడీ వ్యవస్థ అభివృద్ధికి అవసరం అయిన విటమిన్ B6 మామిడిలో ఉంటుంది.
    • గర్భధారణ సమయంలో మీ శరీరంలో ఉన్న ద్రవాలను సమతుల్యం చేసేందుకు మీకు మరిన్ని మినరల్స్ అవసరం అవుతాయి. మామిడిలో మెగ్నీషియం, కాల్షియం, ఉప్పు, పొటాషియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి ద్రవసమతుల్యతను కాపాడుతాయి.
    • గర్భధారణ సమయంలో మెగ్నీషియం తీసుకోవడం వలన ప్రీక్లాంప్సియాను నివారిస్తుంది. మామిడిపండులో ఉండే విటమిన్ E, మెగ్నీషియం పిండం కండరాలను అభివృద్ధి చేయడంలో, ప్రీక్లాంప్సియాను నివారించడంలో సహాయపడతాయి.

    గర్భధారణ సమయంలో మామిడిలోని పోషక విలువలు

    మామిడి గర్భానికి మంచిదేనా? అవును.. గర్భధారణ సమయంలో మామిడిని తీసుకోవడం సురక్షితమే. విటమిన్ C పొందేందుకు మామిడిపండ్లు కూడా గొప్ప మార్గం. మీరు ప్రతి రోజు తీసుకోవాల్సిన 100 శాతం విటమిన్​ను ఒక కప్పుకు సమానమైన మామిడి అందిస్తుంది.

    చాలా మామిడిపండ్లలో విటమిన్ A కూడా లభిస్తుంది. పుట్టినపుడు విటమిన్ A తక్కువగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. దీని వల్ల డయేరియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

    గర్భిణీ స్త్రీల ఆహారంలో మామిడిపండ్లు గొప్పగా ఉంటాయి. అయితే వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇతర పండ్లతో కలిపి తినాలి.

    గర్భధారణ సమయంలో నేను ఎన్ని మామిడిపండ్లను తినగలను?

    మామిడిలో కేలరీలు అధికంగా ఉన్నందున మహిళలు త్వరగా బరువు పెరుగుతారు కాబట్టి మామిడిపండ్లను రోజుకు ఒకటి కంటే ఎక్కువ తినకూడదని సిఫారసు చేయబడింది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో పచ్చి మామిడిని మితంగా తీసుకోవడం మంచిది.

    గర్భధారణ సమయంలో మామిడిపండ్ల వలన సైడ్ ఎఫెక్ట్స్

    1. డయేరియా (విరేచనాలు):

    మామిడిపండ్లు డయేరియా, డీహైడ్రేషన్​కు కారణం అవుతాయి. గర్భధారణ సమయంలో మామిడిని సమతుల్యంగా తీసుకుంటే డీహైడ్రేషన్​ను నివారించవచ్చు.

    2. గర్భధారణ మధుమేహం:

    మామిడిపండ్లలోని చెక్కెర మధుమేహానికి కారణం కావొచ్చు.

    3. అతిగా బరువు పెరగడం:

    మామిడిపండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున గర్భవతిగా ఉన్న సమయంలో తింటే తొందరగా బరువు పెరుగుతారు.

    4. అలెర్జీలు:

    కొంత మంది మామిడి పండు మీద ఉండే పైతొక్క వల్ల లేదా రసం వల్ల అలెర్జీ వస్తుంది. మీ చర్మం దానికి స్పందిస్తే ఆ పండుని దూరం పెట్టండి. రసాయనాలు వాడి పండబెట్టిన మామిడిపండ్లు తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదాన్ని కలుగజేస్తాయి.

    మామిడిపండు సహజంగా పండిందా లేక కృతిమంగా (పౌడర్ వేసి పండించడం) పండిందా? అని ఎలా చెప్పొచ్చు..

    మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో వేయండి. అవి కిందకు మునిగితే అవి సహజంగా పండినట్లు లెక్క. అలా కాకుండా మామిడిపండ్లు తేలుతూ ఉంటే వాటిని పండించేందుకు రసాయనాలను వాడారని అర్థం చేసుకోవాలి. కృతిమంగా పండిన మామిడిపండ్ల నుంచి రసం బయటకు కారదు.

    ఎటువంటి ప్రమాదం లేకుండా మామిడి పండ్లను తినేందుకు చిట్కాలు

    మామిడిపండ్లలో చాలా కేలరీలు ఉంటాయి. మీకు మూడో త్రైమాసికంలో చాలా ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అప్పుడు మామిడి మీకు గుడ్ స్నాక్​గా ఉపయోగపడుతుంది. కానీ.. ఇతర అన్ని పండ్ల వలే గర్భధారణ సమయంలో మామిడిని కూడా మితంగానే తీసుకోవాలి.

    మీరు స్మూతీ, లస్సీ, షేక్, లేదా డెజర్ట్ (భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థం)లో భాగంగా మామిడి పండ్లను ఇష్టపడితే.. అదనపు స్వీట్​నర్స్, క్రీమ్స్ నుంచి వచ్చే కేలరీలు మరియు అదనపు చెక్కెరల గురించి అవగాహన కలిగి ఉండండి. ఎండిన మామిడి, చట్నీలు, మురబ్బా, క్యాండిడ్ మ్యాంగోస్ అన్నింటిలో తీపి పదార్థాలను కలుపుతారు. కాబట్టి వాటిని అప్పుడపుడు మాత్రమే తినండి.

    మార్కెట్లో మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో ఎటువంటి మామిడి పండ్లను కొనాలనే దానిపై శ్రద్ధ వహించండి. వివిధ రకాల రసాయనాలతో పండించిన మామిడిపండ్లను కొనుగోలు చేయకండి. సీజన్​లో మాత్రమే మామిడిపండ్లను కొనుగోలు చేయండి. అప్పుడు మామిడిపండ్లు కృతిమంగా పండే అవకాశం తగ్గుతుంది.

    మీరు గర్భవతిగా ఉన్నపుడు ఏ మామిడిపండ్లను తినొచ్చు?

    మామిడి పండ్లు చెట్ల మీద పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి మాంసం లేదా కూరగాయల వంటివి కావు. అవి లభించే సీజన్​లో మాత్రమే మీరు వాటిని తినగల్గుతారు.

    గర్భవతిగా ఉన్నపుడు నేను మామిడిని తినవచ్చా? శుభవార్త ఏమిటంటే.. మీరు గర్భవతిగా ఉన్నపుడు పచ్చి లేదా పూర్తిగా పండిన మామిడిని కూడా తినవచ్చు.

    గర్భధారణ మొదటి త్రైమాసికంలో మామిడిని తీసుకోవడం గర్భవతులకు చాలా మంచిది. మీ చర్మాన్ని మెరిసేలా తయారు చేస్తాయి. అంతే కాకుండా ఆసిడిటీ మార్నింగ్ సిక్​నెస్ తగ్గేలా సహాయం చేస్తాయి. మీకు అనేక విషయాల్లో సహాయం చేసే అనేక రకాల విటమిన్లు ఇందులో ఉన్నాయి. మీ బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ఇవి అందిస్తాయి.

    గర్భధారణలో పూర్తిగా పండిన మామిడిని తినడం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఎందుకంటే అవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. పగటిపూట మీ ఆకలిని తక్కువ చేస్తాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. ఏది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తుంది.

    గర్భధారణ సమయంలో మామిడిపండు-పాలకూర స్మూతీ

    గర్భధారణ సమయంలో మూడు త్రైమాసికాల్లో కూడా స్మూతీస్ తీసుకోవడం సురక్షితం. మీరు గర్భంతో ఉన్నపుడు మామిడిపండు-పాలకూర స్మూతీని కావాలని అనుకున్నా లేదా క్రీమీగా కోరుకున్నా అధిక ప్రొటీన్ల కోసం ఇవి రెండూ సరైనవే.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.